BREAKING
సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. తడిసిముద్దైన వరి ధాన్యం.. భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శశికళ కృష్ణమోహన్ నాగసముందర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం మహిళా శక్తికి ప్రతీక రుద్రమదేవి-చందుపట్లలో ఘనంగా వర్ధంతి సభ.. నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ పోలీస్ పెట్రోలింగ్ పార్టీ చొరవ.. తప్పిపోయిన బాలుడు క్షేమం తెలంగాణకు భారీ వర్షాలు తట్టేపల్లి వద్ద విద్యార్థుల ఆందోళన.. సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ లాట్వియా గగనతలంలోకి గుర్తుతెలియని డ్రోన్.. అప్రమత్తమైన నాటో యుద్ధ విమానాలు: మెర్సిడెస్-బెంజ్ చైనాలో కొత్త సంయుక్త సంస్థ.. విడిభాగాల తయారీ, సరఫరాపై ప్రత్యేక దృష్టి: సౌదీ అరాంకో చమురు శుద్ధి కేంద్రంపై దాడి..

మహిళా శక్తికి ప్రతీక రుద్రమదేవి-చందుపట్లలో ఘనంగా వర్ధంతి సభ.. నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Select Suryaa Now
మహిళా శక్తికి ప్రతీక రుద్రమదేవి-చందుపట్లలో ఘనంగా వర్ధంతి సభ.. నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని చందుపట్లలో ఘనంగా వర్ధంతి సభ.. నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించి, తన ధైర్యసాహసాలు, పాలనా దక్షతతో చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహారాణి రుద్రమదేవి మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో శుక్రవారం వివేకానంద యువజన మండలి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాణి రుద్రమదేవి వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. రుద్రమదేవి తన ధైర్యసాహసాలతో కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. పురుషాధిక్య సమాజంలోనూ తన నాయకత్వ పటిమను చాటుతూ పాలనలో ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆమె జీవిత చరిత్ర, పోరాట స్ఫూర్తి, పరిపాలనా దక్షత నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. రుద్రమదేవి ఆశయాలు, స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు రుద్రమదేవి జీవితం స్ఫూర్తినిస్తుందని, ఆమె చరిత్రను యువత తెలుసుకోవాలని సూచించారు. చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుల త్యాగాలు, సేవలను స్మరించుకోవడంతోపాటు వారి ఆశయాలను ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల మాధవరెడ్డి, చందుపట్ల గ్రామ సర్పంచ్ దిగోజు లతా వెంకటచారి, ఉపసర్పంచ్ ఓర్సు మంజుల శ్రీను, మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వివేకానంద యువజన మండలి సభ్యులు కోటేష్, టంగుటూరి సైదులు, మంగినిపెల్లి సాయి, పుట్ట రాజు, కాంగ్రెస్ నాయకులు మలిగిరెడ్డి రంగారెడ్డి, మేడవరపు అశోక్ రావు, కోటగిరి రామకృష్ణ, తండు నాగరాజ్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.