బిజీ బిజీగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ క్యాంపు కార్యాలయం
- *బిజీబిజీగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ క్యాంపు కార్యాలయం..*
- *మేయర్ రెడ్డి అప్పలనాయుడు కు అభినందనల వెల్లువ.. నగర ప్రముఖుల ఘన సత్కారం..*
- *జనసేన కార్యాలయానికి పోటెత్తిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు..*
ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు నగర మేయర్ గా ఎన్నికైన జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. మేయర్ గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల శ్రేణులు, ఏలూరు నగర ప్రజలు ఆయనను ఆయన నివాసంలో, జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుఛ్ఛాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.. ఏలూరు నగర పాలకసంస్థ నూతన మేయర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నగర అభివృద్ధిలో కీలకపాత్ర ఆకాక్షించారు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.. వివిధ వర్గాలకు చెందిన కూటమి నాయకులు, రెడ్డి అప్పలనాయుడు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ నాయకుడు పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.. మేయర్ గా ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకం, అభిమానం చూపిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.. ఏలూరు నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ నగర అభివృద్ధికి అందరిని కలుపుకొని ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు.. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.