BREAKING
'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్.. నవంబర్ 27న రిలీజ్ 'వృషకర్మ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 25న గ్రాండ్ ఈవెంట్ 15 దేశాల్లో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా 'బాల 369': విజయ్ కుమార్ కలివరపు హై సినిమా చూశాను.. జెన్ జీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్‌తో అద్భుతంగా తీశారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మోక్షప్రదాయకం.. మహా పవిత్రం కార్తీక సోమవారం! 7వ వార్డు అభ్యర్థిగా ముంతాజ్ బేగం నామినేషన్ దాఖలు "పడాల" నామినేషన్ కు భారీ ఏర్పాట్లు ప్రజాస్వామ్య పరిరక్షణకే మా పయనం! ఘనంగా ఆర్యవైశ్య వన అన్న సమారాధన! ఆటపాటలతో సందడిగా సాగిన వేడుకలు.. పూర్వ సంఘ అధ్యక్షులు, ఆర్యవైశ్య ప్రముఖులకు ఘన సన్మానం ఎన్నికల వేళ గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నేటి పంచాంగం23 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు23 నవంబర్, 2026 కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు

మోక్షప్రదాయకం.. మహా పవిత్రం కార్తీక సోమవారం!

Select Suryaa Now
మోక్షప్రదాయకం.. మహా పవిత్రం కార్తీక సోమవారం!

ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే కార్తీక మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. అయితే, పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం ఈ మాసంలో రావడం మరింత విశిష్టతను సంతరించుకుంటుంది. కార్తీక సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి, శివారాధన చేసి, శక్తికొలది దానధర్మాలు ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి, అంతిమంగా మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పర్వదినాన శైవ క్షేత్రాలను సందర్శించడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది.

సౌభాగ్యం.. సకల ఐశ్వర్యాల ప్రాప్తి

వివాహిత స్త్రీలు (ముత్తైదువలు) ఈ రోజున నియమ నిష్ఠలతో పరమేశ్వరుని ఆరాధిస్తే వారి సౌభాగ్యం కలకాలం నిలిచి ఉంటుందని శాస్త్ర వచనం. భక్తులు తెల్లవారుజామున బ్రహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, తలస్నానం ఆచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. తొలుత ఇంట్లో దీపారాధన చేసిన అనంతరం, శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి వ్రత నియమాలను పాటించాలి. ఇలా ఆచరించడం ద్వారా కుటుంబంలో నిత్యం సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు వివరిస్తున్నారు. ఆ మహాదేవుని కరుణాకటాక్షాలు ఉంటే ఎంతటి కఠినమైన గ్రహదోషాలైనా ఇట్టే తొలగిపోతాయి.

ఆర్థిక కష్టాల నుంచి విముక్తి కలిగించే పూజా విధానం

కార్తీక సోమవారం రోజున ఉమామహేశ్వరులను భక్తితో పూజిస్తే దారిద్య్రం, కష్టాలు దూరమవుతాయి. పూజా మందిరంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి గంధం, కుంకుమలతో అలంకరించి దీపం వెలిగించాలి. సుగంధభరితమైన పుష్పాలతో అర్చించి, శివాష్టకం పఠిస్తూ విభూదిని సమర్పించాలి. నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని స్వామివారికి నివేదించాలి. ప్రతి సోమవారం ఈ విధానాన్ని అనుసరించడం వల్ల అప్పుల బాధలు తీరి, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బిల్వపత్రం, వెలగపండు, ఉసిరి దీపం విశిష్టత

 * బిల్వపత్రం: మూడు దళాలు ఉండే మారేడు ఆకు (బిల్వపత్రం) పరమశివుని త్రినేత్రాలకు, త్రిశూలానికి ప్రతీక. దీనిని స్వామివారికి సమర్పించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.

 * వెలగపండు: భోళాశంకరునికి ఎంతో ఇష్టమైన వెలగపండు దీర్ఘాయుష్షుకు సంకేతం. కార్తీక సోమవారం నాడు దీనిని నైవేద్యంగా సమర్పిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

 * ఉసిరి దీపం: వేకువజామున శివపార్వతులను ఆరాధించడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో రోజూ పూజలు చేయలేని వారు, కనీసం సోమవారం నాడైనా శివాలయంలో ఉసిరికాయపై వత్తులు ఉంచి దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం.

పురాణ గాథ.. పంచకృత్యాల ఆచరణ

స్నానం, దానం, దీపారాధన, అర్చన, దైవ దర్శనం అనే ఐదు విధులను (పంచకృత్యాలు) నిష్ఠతో పాటించడమే 'కార్తీక సోమవార వ్రతం'. పూర్వం వసిష్ఠ మహర్షి ఉపదేశం ద్వారా జనక మహారాజు ఈ వ్రత మహాత్మ్యాన్ని తెలుసుకుని, ఆచరించి పరమశివుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడని పురాణ కథనం.

రుద్రాక్షోపనిషత్తు ప్రకారం.. ఈ రోజున ఉపవాస దీక్షతో శుద్ధజలం, ఆవుపాలు, పంచామృతాలతో రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతో రుద్రార్చన నిర్వహించాలి. ఒకవేళ ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వారు, మంత్రోచ్ఛారణతో స్నానం చేసి, శివ నామస్మరణ, జపం చేసినా మహాదేవుని కృపకు పాత్రులవుతారు. మానసిక ఆందోళనలు, వికారాలను తొలగించుకోవడానికి శివభక్తిని మించిన దివ్యౌషధం మరొకటి లేదని జగద్గురువు ఆదిశంకరాచార్యులు 'శివానందలహరి'లో ఉద్బోధించారు.