"పడాల" నామినేషన్ కు భారీ ఏర్పాట్లు
• అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
• భోగాపురం మార్పునకు మీ సహాయం అవసరం
భోగాపురం, (మేజర్ న్యూస్):
ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ కళ్ళు ముందే భోగాపురం అభివృద్ధిని చేసి చూపిస్తానని సర్పంచ్ బరిలో దిగుతున్న పడాల శ్రీనివాసరావు హామీ ఇస్తున్నారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న 'పడాల'కు ప్రజలు సైతం భ్రమరధం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రత్యర్థులతో బరిలో నువ్వా నేనా అంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. తాము కూడా దొరగారి ఆశీస్సులతోనే రైతు ఉద్యమం దిశగా పార్టీలో ప్రతి ఒక్కరు సమైక్యంగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని గుర్తు చేశారు. ఇక నామినేషన్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిందే..
రిపోర్టర్: వై.శ్రీనివాస్, భోగాపురం.