BREAKING
ప్రజాస్వామ్య పరిరక్షణకే మా పయనం! ఘనంగా ఆర్యవైశ్య వన అన్న సమారాధన! ఆటపాటలతో సందడిగా సాగిన వేడుకలు.. పూర్వ సంఘ అధ్యక్షులు, ఆర్యవైశ్య ప్రముఖులకు ఘన సన్మానం ఎన్నికల వేళ గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నేటి పంచాంగం23 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు23 నవంబర్, 2026 కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం

ప్రజాస్వామ్య పరిరక్షణకే మా పయనం!

Select Suryaa Now
ప్రజాస్వామ్య పరిరక్షణకే మా పయనం!
  • వేలంపాట రాజకీయాలకు వ్యతిరేకంగా..
  • ముంజెరు సర్పంచ్ బరిలోకి పులపా భవాని
  • ముంజేరు గ్రామంలో ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా సర్పంచ్ ఎన్నికల పోరు

భోగాపురం, (మేజర్ న్యూస్):  భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గ్రామ సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా దక్కించుకోవాలనే ప్రయత్నాలకు వ్యతిరేకంగా మాజీ ఆర్మీ సైనికుడు నరేష్ పులపా తన భార్య పులపా భవానిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపారు. ఈరోజు భవాని నామినేషన్ దాఖలు చేశారు. దేశ సరిహద్దుల్లో 17 సంవత్సరాల పాటు భారత సైన్యంలో సేవలందించి దేశ రక్షణ కోసం పనిచేసిన నరేష్ పులపా, ప్రస్తుతం తన సొంత గ్రామంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటానికి సిద్ధమయ్యారు."అప్పుడు దేశ సరిహద్దుల్లో శత్రువులపై పోరాటం చేశాను.. ఇప్పుడు నా గ్రామంలో ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనాలనుకునే ఆలోచనలకు వ్యతిరేకంగా నిలబడుతున్నాను" అనే నినాదంతో ఆయన ముందుకు సాగుతున్నారు. గ్రామానికి దూరంగా రాయపూర్‌లో నివసిస్తూ, ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకోని వ్యక్తి డబ్బు అండతో సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. సర్పంచ్ పదవి అనేది వేలంపాటలో కొనుక్కునే వస్తువు కాదని, అది ప్రజల నమ్మకంతో, ప్రజల ఓట్లతో దక్కించుకోవాల్సిన బాధ్యతాయుతమైన పదవని నరేష్ పులపా అభిప్రాయ పడుతున్నారు. ఈ పోరాటానికి గ్రామంలోని యువత, పలువురు గ్రామస్తులు మద్దతుగా నిలుస్తూ భవాని అభ్యర్థిత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. "దేశం కోసం సరిహద్దుల్లో నిలబడ్డ వ్యక్తి.. తన ఊరి ప్రజాస్వామ్యం కోసం ఇప్పుడు గ్రామంలో నిలబడ్డాడు. అధికారం కోసం కాదు.. ప్రజల ఓటు హక్కు విలువను కాపాడటం కోసం ఈ పోరాటం" అంటూ మద్దతుదారులు పేర్కొంటున్నారు. ముంజేరు గ్రామంలో ఈ ఎన్నికలు కేవలం సర్పంచ్ పదవికి సంబంధించిన పోటీ మాత్రమే కాకుండా, డబ్బు ప్రభావానికి ప్రజాస్వామ్య విలువలకు మధ్య జరుగుతున్న పోరాటంగా మారుతున్నాయి. చివరికి గ్రామ ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ప్రజాస్వామ్యానికి తమ ఓటుతో ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

 రిపోర్టర్: వై.శ్రీనివాస్, భోగాపురం.