BREAKING
పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతున్న కార్నివాల్ భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ : భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పీఎం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1.5లక్షల వరకు చికిత్స - ఎస్పీ అఖిల్ మహాజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భక్తుల కొంగుబంగారం అహోబిలేశ్వరుడు.. భక్తిశ్రద్ధలతో పూజలు ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు.

భక్తుల కొంగుబంగారం అహోబిలేశ్వరుడు.. భక్తిశ్రద్ధలతో పూజలు

Select Suryaa Now
భక్తుల కొంగుబంగారం అహోబిలేశ్వరుడు.. భక్తిశ్రద్ధలతో పూజలు

తాడిమర్రి సూర్య రిపోర్టర్  : - మండల కేంద్రంలోని మద్దెల చెరువు దారిలో ఉన్న శాతవాహన వీధిలో కొలువుదీరిన శ్రీ అహోబిలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆదివారం సందర్భంగా భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తితో స్వామివారిని స్మరించుకుంటూ అర్చనలు చేసి, తమ కుటుంబాల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని ప్రార్థించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానికంగా వెలసిన అహోబిలేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ప్రత్యేక పూజల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి. స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి ఒక్కరిపై అహోబిలేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని, గ్రామ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని భక్తులు ఆకాంక్షించారు. ప్రత్యేక పూజలతో శాతవాహన వీధిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది,  బండారు వెంకటేష్  తాడిమర్రి సూర్య రిపోర్టర్ .