BREAKING
ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ

పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి..

Select Suryaa Now
పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి..


- రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన.

నరసన్నపేట, మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన పాల్గొన్నారు. కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జామి ప్రత్యూష (జామి వెంకట్రావు)తో పాటు వార్డు సభ్యుడు సరిపల్లి మధుకు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా బగ్గు అర్చన మాట్లాడుతూ నరసన్నపేట సమగ్ర అభివృద్ధి కోసం కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నరసన్నపేట పట్టణ రూపురేఖలు మార్చేందుకు, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేందుకు కూటమి అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు.
సర్పంచ్ అభ్యర్థి జామి ప్రత్యూషకు కేటాయించిన వంకాయ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన, నమ్మకమైన ప్రజాసేవే లక్ష్యంగా జామి వెంకట్రావు కుటుంబం పనిచేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.