BREAKING
ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ

ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి

Select Suryaa Now
ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను  నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి

 

 

గరుగుబిల్లి, మేజర్ న్యూస్: గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా  ఎన్నికైన తెర్లి రామలక్ష్మి తన అఖండ విజయాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేశారు.ఈసందర్భంగా ఎంపీటీసీ సభ్యులు తెర్లి ఎల్లమునాయుడుతో కలిసి నూతన సర్పంచ్‌ తెర్లి రామ లక్ష్మి"సూర్య"ప్రతినిధితో మాట్లాడారు. ఈసందర్భంగా తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞ తలు తెలిపారు.గ్రామ ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో వేసిన ప్రతి ఓటుకు రుణపడి ఉంటానని తెలిపారు.తన గెలుపు వ్యక్తిగత విజయం కాదని, పెద్దూరు గ్రామ పంచాయతీ ప్రజలందరి సమష్టి విజయమని పేర్కొన్నారు.ఈ గెలుపు తన వ్యక్తిగత విజయం కాదని గ్రామ అభివృద్ధిని కాంక్షించిన ప్రతి ఒక్కరి విజయమని ఆమె పేర్కొన్నారు రాబోయే రోజుల్లో పార్టీలకతీతంగా అందరి సహకారంతో పెద్దూరు గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శం గా తీర్చిదిద్దేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈసందర్భం గా రామలక్ష్మి స్పష్టం చేశారు.గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకము ఆశీస్సుల వల్లే ఈఘన విజయం సాధ్యమైందని సర్పంచ్ తెర్లి రామలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.ఎలాంటి రాజ కీయ భేదాభిప్రాయాలకు తావులేకుం డా, గ్రామంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో మౌలిక సదుపా యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయడమే తన మొదటి ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు.తన గెలుపులో భాగ స్వాములైన నాయకులు,కార్యకర్తలు, యువత మరియు మహిళలకు సర్పంచ్ తెర్లి రామలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.