ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ
విజయనగరం మేజర్ న్యూస్:
విజయనగరం: ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ 100వ వారం వేడుకల్లో భాగంగా మై భారత్ విజయనగరం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడంతో పాటు నషా ముక్త్ అభియాన్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయనగరం ఇండోర్ స్టేడియం సమీపంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని మై భారత్ జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సైక్లింగ్, వ్యాయామం వంటి శారీరక కార్యకలాపాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఫిట్ ఇండియా లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం పాల్గొన్న వారితో నషా ముక్త్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో శాప్ కోచ్‌లు రవి కుమార్, మురళీకృష్ణ, మై భారత్ సిబ్బంది, వాలంటీర్లు మరియు యువత పాల్గొన్నారు.