వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ...
నరసన్నపేట, మేజర్ న్యూస్:
నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి పొట్నూరు వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా ఆదివారం యువత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ బూరళ్ళి శంకర్ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు ప్రచారంలో పాల్గొని పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో ర్యాలీగా పర్యటించారు.
ఈ సందర్భంగా తాళం చెవి గుర్తుపై ఓటు వేసి పొట్నూరు వాణి సాయి ప్రసాద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువత ఓటర్లను అభ్యర్థించారు. నీతివంతమైన పరిపాలన, పారదర్శక పాలన, పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
నరసన్నపేట పట్టణంలోని సమస్యలపై సమగ్ర అవగాహనతో, వాటి పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తామని ప్రచారంలో వివరించారు. పట్టణంలోని సమస్యలన్నింటినీ పుస్తక రూపంలో సేకరించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు నిరంతర తాగునీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొనడంతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.