telangana
రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో నవంబర్ 27, 28, 29 తేదీలలో హైదరాబాద్‌లోని అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా విహార్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ, అథ్లెటిక్స్ పోటీలలో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు.
ఈ పోటీలలో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు మొత్తం 33 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 17 ప్రథమ స్థానాలు, 10 ద్వితీయ స్థానాలు, 6 తృతీయ స్థానాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.రాష్ట్రస్థాయిలో 8 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీపడి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలవడం పట్ల వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.విజయం సాధించిన క్రీడాకారులకు, వారికి శిక్షణ అందించిన కోచ్‌లకు మరియు సహకరించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా డిసెంబర్ మాసం లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.