నిబంధనలకు విరుద్ధంగా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక* *అర్హులైన క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్*
నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా సీనియర్ క్రీడాకారులు ఆరోపించారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం జిల్లా అధ్యక్ష ,కార్యదర్శుల పదవులకు పోటీపడే అభ్యర్థులు స్థానికులై ఉండాలని ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి స్థానికేతరుడు గద్వాల జిల్లా,అలంపూర్ మండలం,బుక్కాపురం గ్రామానికి చెందిన సోల పోగుల స్వాములు అనే వ్యక్తి నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా ఏకపక్షంగా ఎన్నికల నిర్వహించుకొని ఏకగ్రీవంగా కమిటీని ప్రకటించుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ క్రీడాకారులు ఎడ్మ శ్రీను యాదవ్ పసుపుల పరుశురాముడు బిక్షపతి యాదవ్,బాలరాజు శ్రీను నాయక్,నారాయణ మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికల అనేవి కొంతమంది వ్యక్తుల నిర్ణయం ప్రకారం కాకుండా అసోసియేషన్ రాజ్యాంగం ఎన్నికల నిబంధనలు మరియు సంబంధిత అథ్లెటిక్స్ సమస్యలు మార్గదర్శక ప్రకారంగా పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఓటర్ల జాబితా ప్రకటించకుండా రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరో తెలియకుండా నియమ వివరాలు ఎందుకు వెల్లడించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు అర్హులకు నామినేషన్ వారాలు ఎన్నికైన నియమాలు అందుబాటులో లేకుండా గతంలో అథ్లెటిక్స్ బాధ్యతలు నిర్వహించిన సభ్యుల ఓటు హక్కు పై స్పష్టత ఎందుకు ఇవ్వలేదు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు అందించిన సమస్యను పట్టించుకోలేదని జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో కూడా మా సమస్యను తెలియజేశామని తెలిపారు. జిల్లా అత్యధిక అసోసియేషన్ ఎన్నిక అభ్యంతరాలపై సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం అందించి అర్హులైన సభ్యుల హక్కులను పరిరక్షించి నూతన కమిటీ ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనయ్య, కల్వకుర్తి సూర్య న్యూస్