వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు!
సూర్య బెజ్జుర్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూరు మండలం ఉట్స్ సారంగపల్లి గ్రామంలో చంద్రయ్య టీచర్ ఇంటి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి ఈరోజు ఉదయం నుంచి మిషన్ భగీరథ నీరు వృథాగా పారుతోంది. నీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ సక్రమంగా తాగునీరు సరఫరా చేయాల్సిన అధికారులు, మరోవైపు నీరు వృథాగా పోతుంటే అరికట్టకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన తాగునీరు ఇలా వృథా కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.