వత్సవాయిలో ప్రారంభమైన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
వత్సవాయి మండలంలో గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై గ్రామాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.