వత్సవాయిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాతయ్య
వత్సవాయిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాతయ్య
వత్సవాయి: నవంబర్ 29, ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా వత్సవాయి గ్రామంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించి, ఎన్నికల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతున్న తీరును పరిశీలించారు.