గత పాలకులు రిలీవలస పంచాయతీని భ్రష్టు పట్టించారు
పూసపాటిరేగ, మేజర్ న్యూస్: రాష్ట్రంలో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వారు, మండల స్థాయిలో ఆరుసార్లు ఎంపీపీగా గెలిచిన పాలకులు రెల్లివలస పంచాయతీని అభివృద్ధి కాకుండా బ్రష్టు పట్టించారని సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న తెదేపా నాయకుడు ఇజ్రోతు ఈశ్వర రావు ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్ద వీధిలో నిర్వహించిన ప్రచార సభలో ఈశ్వరరావు మాట్లాడుతూ ఇదే పంచాయతీ నుంచి ఎమ్మెల్యేగా ఏడుసార్లు ప్రాతినిధ్యం వహించిన నారాయణస్వామి నాయుడుతో పాటు ఆరుసార్లు ఎంపీపీగా ప్రాతినిధ్యం వహించిన చిన్న నాయుడు, ఇదే గ్రామం నుంచి ఎంపీపీగా ప్రాతినిధ్యం వహించిన కళ్యాణి, గతంలో నాలుగు సార్లు సర్పంచ్ గా గతంలో పాలించిన వారు రెల్లివలస పంచాయతీకి అభివృద్ధి విషయంలో ఒరిగిందేమీ లేదంటూ మైండ్ పడ్డారు. పూసపాటిరేగ మండలంలోని పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నప్పటికీ సి ఎస్ ఆర్ నిధులు ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉండగా గత పాలకులు ఎందుకు
* పట్టించుకోలేదంటూ గత పాలకుల తీరును ఎండగట్టారు. తన సతీమణి అప్పలరాజు సర్పంచ్ పదవి చేసేక పంచాయతీలో సిసి రహదారులతో పాటు విద్యుత్ శాఖ ద్వారా 90 వరకు విద్యుత్తు పోల్స్ వేయించి పంచాయతీకి విద్యుత్ కాంతుల శోభ తెప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి చెందిన జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సహకారంతో ప్రభుత్వ నిధులను రప్పించి గ్రామానికి పెద్ద ఎత్తున సిసి రహదారులు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు అవకాశం కల్పిస్తే పంచాయితీని జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానంటూ సర్పంచ్ అభ్యర్థి ఇజ్రోతు ఈశ్వర రావు సభ ముఖంగా పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు కూడా తాను పోటీ చేయకుండా కొంతమంది నాయకులు వైసిపి తో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారని, రూ.1.6 కోట్ల వరకు వేలం పాటకు సిద్ధపడ్డారని అందుకు తాను సమతించకపోవడంతో తనకు వ్యతిరేకంగా అనేక ఆటంకాలు కల్పించినప్పటికీ జనాదరణ తనకే ఉండడంతో అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుతో సర్పంచ్ గా గెలుస్తానన్న ఆశాభావాన్ని ఈశ్వర రావు వ్యక్తం చేశారు.
*