సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ
సూర్య,సిర్పూర్(టి): మహిళా సంఘాల కోసం నిర్మించారు మహిళా సంఘం సమాఖ్య భవన నిర్మాణానికి ఆదివారం భూమి నిర్వహించారు. మండలంలో చింతకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని చుంచుపల్లి గ్రామంలో గ్రామ సమాఖ్య భవణ నిర్మాణం కొరకు సర్పంచ్ చత్రునాయక్ భూమి పూజ చేసి, నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ చంద్రయ్య, ఏఇ ఆత్మారాం, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులు, కార్యదర్శి శాలిని పాల్గొన్నారు.