మిర్యాలగూడలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ *54 అడుగుల స్వామివారి విగ్రహం ప్రతిష్ఠాపన.. భక్తుల సందడి*
మిర్యాలగూడలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ
*54 అడుగుల స్వామివారి విగ్రహం ప్రతిష్ఠాపన.. భక్తుల సందడి*
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ జంక్షన్ వై జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన 54 అడుగుల శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి విగ్రహంతో పాటు నవగ్రహ విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ దంపతులు, దేవాలయ కమిటీ చైర్మన్ తిరునగరు భాగ్యవ్ నాగలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్రాటి రమేష్, అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు బండారు కుశలయ్య, కోశాధికారి గంగదేవి రాము, వివిధ పార్టీల నాయకులు మిట్టపల్లి వెంకటేష్, గొంగిడి సుధీర్‌రెడ్డి, బంటు శ్రీనివాస్, గుండా నాగరాజు, బంటు లక్ష్మీనారాయణ, తిరుమలగిరి వజ్జం, విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతిష్ఠాపన అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.