BREAKING
సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ కుటుంబ పెద్ద మృతి.. యధావిదంగా వ్యాపార లావాదేవీలు. బెంగళూరు బేకరీ యాజమాన్యం పై విమర్శలు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి. అసత్య ఆరోపణలు మానుకోవాలి.. తెలుగుదేశం పార్టీ నాయకులు. గత పాలకులు రిలీవలస పంచాయతీని భ్రష్టు పట్టించారు చిరు వ్యాపారులకు అండగా ఉంటా - కావేటి సబితా మనోహర్ పిడుగురాళ్లలో ఘనంగా విశ్వబ్రాహ్మణ కార్తీక వనసమారాధన అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా రెండో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్. ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి -దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది – దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ హీరో షోరూం లో దొంగల బీభత్సవం.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి..!! పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు కన్నెపల్లిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని

చిరు వ్యాపారులకు అండగా ఉంటా - కావేటి సబితా మనోహర్

Select Suryaa Now
చిరు వ్యాపారులకు అండగా ఉంటా - కావేటి సబితా మనోహర్

సూర్య, కాగజ్ నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ కాంప్లెక్స్ ఎదుట ఎన్నో సంవత్సరాలుగా చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపు వ్యవహారంపై తెలంగాణ రక్షణ సేన సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత మనోహర్ ఆదివారం తీవ్రంగా స్పందించారు.ఏళ్ల తరబడి ఇదే వ్యాపారాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న పేద చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిన్న వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీసేలా చర్యలు తీసుకోవడం సరికాదన్నారు.పట్టణ అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పనులు చేపట్టడం అవసరమేనని, అయితే అభివృద్ధి పేరుతో పేదల జీవనోపాధి దెబ్బతినకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దుకాణాల తొలగింపునకు ముందు వ్యాపారులకు ముందస్తు సమాచారం ఇచ్చారా? వారికి ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకునేందుకు స్థలం కేటాయించారా? అనే విషయాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఎన్నో ఏళ్లుగా కష్టపడి చిన్న వ్యాపారాల ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్న వారికి ఒక్కసారిగా ఉపాధి లేకుండా చేయడం వల్ల వారి పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి బాధిత వ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు.పేదల కడుపు కొట్టకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని, చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కావేటి సబిత డిమాండ్ చేశారు. బాధిత చిరు వ్యాపారులకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.