BREAKING
పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు కన్నెపల్లిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని కన్నెపల్లిలో వేగవంతంగా ఐకేపీ భవన్ నిర్మాణ పనులు డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్ చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు.

సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని

Select Suryaa Now
సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని

​గుంటూరు: సమాజంలో అవసరమైన వారికి అండగా నిలవడం, సేవా కార్యక్రమాల ద్వారా ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పీడీజీ ఏకేఎస్ డాక్టర్ రవి వడ్లమాని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని హోటల్ సింధూరిలో “జెనరాసిటీ ఇన్ యాక్షన్” అనే అంశంపై ప్రత్యేక ప్రసంగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన డాక్టర్ రవి వడ్లమాని మాట్లాడుతూ.. దాతృత్వం, సేవాభావం, సమాజ అభివృద్ధిలో రోటరీ సభ్యుల పాత్ర గురించి వివరించారు. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రోటేరియన్ ఒలయింకా హకీమ్ బాబాలోలా, జిల్లా గవర్నర్ రోటేరియన్ ఏకేఎస్ ఉదయ్ సుధీర్ పిలానీ నాయకత్వంలో రోటరీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.​క్లబ్ అధ్యక్షులు డాక్టర్ పొందూరి శివప్రసాద్ మాట్లాడుతూ.. రోటరీ ఫౌండేషన్‌కు సభ్యులు తమ వంతు సహాయాన్ని అందించి, తద్వారా సమాజానికి మరిన్ని సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రోటరీ ఫౌండేషన్‌కు 2,000 డాలర్ల విరాళాన్ని ప్రకటించిన రొటేరియన్ గడ్డిపాటి సుధాకర్‌ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.​ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు కార్యదర్శి చంద్రశేఖరన్, కోశాధికారి కొల్లి అరవింద్ కుమార్, మాజీ అధ్యక్షులు గడ్డిపాటి సుధాకర్, పీవీ సత్యనారాయణ, అనిల్ ఆర్నాతక, పబ్బిశెట్టి లక్ష్మీనారాయణలతో పాటు సభ్యులు శోభనంద్, చెరుకూరి శ్రీనివాసరావు, నంబూరు సుబ్బారావు, మద్దు హనుమంతరావు, వనమా రమేష్, మాధవరావు, కొల్లా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్