సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో చేపట్టిన భద్రత ఏర్పాట్లతో పాటు పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన భద్రతా వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సెక్టార్ అధికారులు, సాయుధ బలగాలు, స్థానిక పోలీసులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఘర్షణలు తలెత్తకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*