పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ
కడప: జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లె గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం లోపల ఏజెంట్లు కూర్చునే విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన స్వల్ప వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది.
మరోవైపు, పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన వారిని కొందరు బెదిరిస్తున్నారని స్థానిక మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలు స్పందిస్తూ, సాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే తమపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిణామాలతో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా గందరగోళం నెలకొంది