BREAKING
తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం న్యూజిలాండ్ రాజకీయాల్లో కీలక మలుపు తైవాన్ ఎన్నికల ఫలితాలపై చైనా కీలక హెచ్చరిక యల్లనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఆరుగురికి గాయాలు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. ఎస్సై గోపి యాదవ్. డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుక పాల్గొనే ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పౌరీ గఢ్వాల్ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బైరి నాగలక్ష్మి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని

యల్లనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఆరుగురికి గాయాలు..

Select Suryaa Now
యల్లనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఆరుగురికి గాయాలు..

అనంతపురం, సూర్య న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సింగనమల నియోజకవర్గం పరిధిలోని యల్లనూరు మండల కేంద్రంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది.

పోలింగ్ ఏజెంట్లుగా వెళ్లే విషయంలో ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన ఇరు పార్టీల శ్రేణులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే వేట కొడవళ్లు, కట్టెలతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ దాడిలో టీడీపీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యల్లనూరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

URL Slug: clash-between-tdp-and-ysrcp-workers-in-yellanur-anantapur-district