BREAKING
తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం న్యూజిలాండ్ రాజకీయాల్లో కీలక మలుపు తైవాన్ ఎన్నికల ఫలితాలపై చైనా కీలక హెచ్చరిక యల్లనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఆరుగురికి గాయాలు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. ఎస్సై గోపి యాదవ్. డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుక పాల్గొనే ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పౌరీ గఢ్వాల్ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బైరి నాగలక్ష్మి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. ఎస్సై గోపి యాదవ్.

Select Suryaa Now
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. ఎస్సై గోపి యాదవ్.

కంబదూరు : సోషల్ మీడియాలో వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు సృష్టించేలా రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, వివాదాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంబదూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హెచ్చరించారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికలపై ఒక వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలు గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఏదైనా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండా, నిర్ధారణ కాని సమాచారాన్ని పోస్టుల రూపంలో ప్రచారం చేయడం, ఇతరులు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలను షేర్ చేయడం వల్ల వివాదాలు మరింత తీవ్రతరం కావచ్చని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా పోస్టులు పెట్టే వ్యక్తులపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి, వారి పోస్టులు, వ్యాఖ్యలు, వీడియోల ఆధారంగా చట్టప్రకారం కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ఎలాంటి సమాచారాన్ని అయినా ముందుగా ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని, అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కంబదూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.