BREAKING
చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా? జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు బీరు సీసాతో మెడ పై పొడిచి, దాడి - ఐదుగిరి పై కేసు- కమ్మర్ పల్లి ఎస్ఐ వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా?

Select Suryaa Now
సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా?

 

• దేవస్థానంలో ఉద్యోగులు.. ఎన్నికల రికార్డుల్లో పురోహితులు!

• రిటర్నింగ్ అధికారి సంతకంతో కీలక పత్రం వెలుగులోకి

• ఇద్దరు వ్రత పురోహితులపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం

• తప్పుడు డిక్లరేషన్లపై బీఎన్‌ఎస్‌ చట్టం కింద చర్యలకు అవకాశం

• దేవాదాయ, ఎన్నికల అధికారుల బాధ్యతపై ప్రశ్నలు

  ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో – 

(అన్నవరం)

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వ్రత పురోహితుల ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు వ్రత పురోహితులను శనివారం  రాత్రి 11 తరువాత దేవస్థానం అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే సస్పెన్షన్‌తోనే ఈ వ్యవహారానికి ముగింపు పలుకుతారా? వారి ఉద్యోగ హోదాను ఎన్నికల సంఘానికి నివేదిస్తారా? కొత్త ఈవో  భక్తుల మనోభావాలు కాపాడుతారా అన్నది  ప్రధానాంశంగామారింది. దీనిపై ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో అందించిన క్షేత్రస్థాయిలో పరిశీలనాత్మక కథనం..

శంఖవరం మండలం ఎ.అన్నవరం గ్రామ పంచాయతీ 11వ వార్డులో దేవులపల్లి ఎన్‌.వి.సూర్యప్రకాశరావు, మొక్కరాల రవికిరణ్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నెల 24న రిటర్నింగ్ అధికారి ప్రకటించిన ఫారం–VIలో ఒకరి వృత్తి ‘పురోహితులు’గా, మరొకరి వృత్తి ‘పురోహితం’గా నమోదైంది. దేవస్థానంలో వారు నిర్వహిస్తున్న ఉద్యోగ హోదా మాత్రం ఆ జాబితాలో కనిపించడం లేదు. అసలు నామినేషన్ పత్రాల్లోనూ ఇదే సమాచారం ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది.

స్వతంత్ర పురోహితులా.. దేవస్థానం ఉద్యోగులా?

అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితులకు గ్రేడ్లు, పదోన్నతులు, సీనియారిటీ వ్యవస్థ ఉన్నట్లు హైకోర్టు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దాఖలైన డబ్ల్యూపీ నంబరు 14043/2020కు సంబంధించిన ఉత్తర్వుల్లో దేవాదాయ కమిషనర్ మార్గదర్శకాలు, వ్రత పురోహితుల పదోన్నతుల ప్రొసీడింగ్స్ ప్రస్తావన ఉంది. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 35 ప్రకారం ఆలయ ఉద్యోగుల నియామకాలు, పారితోషికం, ప్రవర్తన, క్రమశిక్షణకు ప్రత్యేక సర్వీసు వ్యవస్థ ఉంది. ఈ నేపథ్యంలో వారి ఉద్యోగ హోదా, ఎన్నికల అర్హతను పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.

తప్పుడు ప్రకటన చేస్తే క్రిమినల్ చర్యలు!

ఎన్నికల అధికారులకు చట్టబద్ధంగా సమర్పించాల్సిన సమాచారంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు నిర్ధారణైతే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 212, 216, 236 కింద క్రిమినల్ చర్యలకు అవకాశం ఉంది. ప్రకటన స్వరూపాన్ని బట్టి ఆయా సెక్షన్ల వర్తింపు ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం వారి ఎన్నికల అర్హతను కూడా పరిశీలించాల్సి ఉంది.

ఈవో లక్ష్మీ శివజ్యోతి బాధ్యత ముగిసినట్టేనా?

వ్రత పురోహితులను సస్పెండ్ చేసినంత మాత్రాన వారి ఉద్యోగ సంబంధం రద్దు కాదు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. లక్ష్మీ శివజ్యోతి వారి నియామక ఉత్తర్వులు, ఉద్యోగ హోదా, పారితోషికం, సస్పెన్షన్ వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తక్షణమే నివేదించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల రికార్డులతో దేవస్థానం ఉద్యోగ రికార్డులను సరిపోల్చి, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటనలు చేసినట్లు తేలితే క్రిమినల్ చర్యలకు సిఫారసు చేయాలి. ఇప్పటికే ఈ మేరకు ఈవో ఏదైనా నివేదిక పంపారా అన్నది వెల్లడించాల్సి ఉంది. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ‘సూర్య’ పలుమార్లు ఫోన్ చేయగా, ఈవో క్వార్టర్స్‌లో గృహప్రవేశ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఆమె ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడంతో వివరణ పొందలేకపోయాం.

డిసెంబరు 2న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ, ఎన్నికల యంత్రాంగం ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. సస్పెన్షన్ ఉత్తర్వులు, అసలు నామినేషన్ పత్రాలు వెలుగులోకి వస్తే ఈ వ్యవహారంలో మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.