జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని 7వ వార్డులో ఆక్స్‌ఫర్డ్ పాఠశాల ఎదుట ప్రధాన రహదారిని అక్రమంగా తవ్వడం చర్చనీయాంశంగా మారింది. నాలా పైప్‌లైన్ కోసం రోడ్డును తవ్వినట్లు స్థానికులు చెబుతున్నారు.రోడ్డును తవ్విన అనంతరం అడ్డదిడ్డంగా మట్టితో పూడ్చివేయడంతో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే రోడ్లు స్థలాన్ని పరిశీలించి, రోడ్డు తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా రోడ్డును తవ్వినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డును సక్రమంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.