బైరి నాగలక్ష్మి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని
బైరి నాగలక్ష్మి పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి నివాళులు....
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలంలోని లోని
అహోబిలం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన దాడుల్లో గాయపడి మృతి చెందిన బైరి నాగలక్ష్మి పార్థివదేహానికి ఆళ్లగడ్డ మాజీ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఆదివారం అహోబిలంలోని నాగలక్ష్మి స్వగృహానికి చేరుకున్న ఆయన, మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ తరపున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గంధం రాఘవరెడ్డి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు మరియు అహోబిలం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా