బద్వేల్ మున్సిపాలిటీ పెట్రోల్ బంకుల్లో సిబ్బంది కొరత..గంటల తరబడి వేచి చూస్తున్న కస్టమర్లు పట్టించుకోని మున్సిపల్ కమిషనర్
బద్వేల్ మేజర్ న్యూస్
బద్వేల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో సిబ్బంది కొరతతో వాహనదారుడు ఇబ్బంది కి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే గతంలో మునిసిపల్ కమిషనర్ గా ఉన్న నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పెట్రోల్ కొరత ఉన్నప్పుడు యధావిధిగా వాహనదారులకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకులో నిరంతరంపెట్రోల్ డీజిల్ వాహనదారులకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ విధుల్లో చేరినప్పటి నుంచి మున్సిపాలిటీ పెట్రోల్ సంబంధించి పట్టించుకోకపోవడంతో అక్కడ పనిచేస్తున్న మేనేజర్ విధులలో నిర్లక్ష్యం వహించడంతో బంకులో పనిచేసేందుకు సిబ్బంది వెనుకంజు వేస్తున్నారు.నలుగురు సిబ్బంది డ్యూటీని చేయాల్సి ఉంటే ఇద్దరే చేస్తున్నట్లు సమాచారం.ఎప్పుడు పెట్రోల్ కోసం వెళ్లినా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు.
నలుగురు సిబ్బంది ఉండాల్సిన ప్లేస్‌లో ఇద్దరితోనే బంకు నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ బంకులో నలుగురు ఐదుగురు పేరుతో విధులు నిర్వహిస్తున్నట్లు జీతాలు తీసుకున్నట్లుగా విశ్వనీయ సమాచారం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పెట్రోల్ బంక్ నిర్వహణలో లోటు పాట్లు సరిచేసి వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ విషయమై వివరణ కోరెందుకు మునిసిపల్ కమిషనర్ కు ఫోను ద్వారా సంప్రదించగా ఆయన ఆయన అందు బాట్లోలేనట్లు సమాచారం వస్తుంది
రిపోర్టర్.. సిరవికుమార్ బద్వేల్ ,ఇంచార్జ్ కడప జిల్లా