BREAKING
జిల్లావ్యాప్తంగా రెండవ రోజు కొనసాగిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా? జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు బీరు సీసాతో మెడ పై పొడిచి, దాడి - ఐదుగిరి పై కేసు- కమ్మర్ పల్లి ఎస్ఐ వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లావ్యాప్తంగా రెండవ రోజు కొనసాగిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

Select Suryaa Now
జిల్లావ్యాప్తంగా రెండవ రోజు కొనసాగిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ – జిల్లా ఎస్పీ  స్నేహ మెహ్ర

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:

వికారాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనల అమలు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ  స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రెండవ రోజు కూడా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లాలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన రహదారుల వద్ద రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా వాహనాల పత్రాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా e-Petty కేసులు, DD కేసులు, e-Challans నమోదు చేయడంతో పాటు ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో జిల్లావ్యాప్తంగా మొత్తం 1,264 వాహనాలను తనిఖీ చేయగా, వాటిలో 637 ద్విచక్ర వాహనాలు, 180 త్రిచక్ర వాహనాలు, 279 నాలుగు చక్రాల వాహనాలు, 168 భారీ వాహనాలు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా 213 e-Petty కేసులు, 69 DD కేసులు నమోదు చేయగా, 279 e-Challans విధించి మొత్తం రూ.1,05,935 జరిమానా విధించడం జరిగింది.జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆమె తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని, పోలీసుల తనిఖీలకు సహకరించాలని సూచించారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.