BREAKING
బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం న్యూజిలాండ్ రాజకీయాల్లో కీలక మలుపు తైవాన్ ఎన్నికల ఫలితాలపై చైనా కీలక హెచ్చరిక

29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani

Select Suryaa Now
29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani

29.11.2026 నుండీ 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

మేషరాశి...

ప్రారంభంలో వృత్తిపరంగా అధిక శ్రమ, బాధ్యతలు. గృహ, విద్య విషయాల ప్రణాళికలలో ఉద్వేగాలధికం. నూతన విషయాలు నేర్చుకుంటారు. సంతానము, పెట్టుబడులు, ఆశించిన లాభాల రీత్యా చేసే ఆలోచనలలో ఆత్మీయుల సంప్రదింపులు అవసరం. మధ్యలో ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ బేదములు లేకుండా, వాదనలకు ఘర్షణలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు విద్య విషయాలలో గురువులను, మార్గదర్శకులను సంప్రదించాలి. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత ముఖ్యం. వృత్తి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. జాయింట్ వెంచర్స్ విషయంలో, ప్రయాణాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వారం చివరిలో వ్యాపార, భాగస్వామ్య నిర్ణయాలలో మిశ్రమ ఫలితాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది. 

వృషభరాశి… 

వారం ప్రారంభంలో సామర్ధ్యంతో పనులు పూర్తి చేస్తారు, దగ్గర ప్రయాణాలు, తోబుట్టువులు, మిత్రుల కలయికలు. గృహ, విద్య, స్థిరాస్తి, సంబంధ అంశాలలో ఘర్షణాత్మక నిర్ణయాలకు, అహం సమస్యలకు దూరం మేలు. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. మధ్యలో సంతాన విషయాలు, పెట్టుబడులు, ఆశించిన అంశాలలో తగిన శ్రద్ధ అవసరం రీత్యా ఎదుటి వారితో కమ్యూనికేషన్లో జాగ్రత్త లు తీసుకోవాలి. నెట్వర్క్, పెద్దల సహకారం, ఆశించిన లాభాల ఆలస్యల వలన మానసిక ఘర్షణ, ఆందోళనలు అధిగమించాలి. వారం చివరిలో స్త్రీలతో, మిత్రులతో అనవసర వివాదాలకు తావివ్వరాదు. ఆరోగ్య శ్రద్ధ, రొటీన్ మార్పులు, రుణ విషయాలు ఆలోచన చేస్తారు. దత్తారాధన, గణపతి మందిరదర్శన మంచిది.

మిధున రాశి… 

వారం ప్రారంభంలో ఆర్థిక, కుటుంబ వ్యవహారాలపై ఆలోచనలు, ప్రణాళిక ప్రయత్నాలు చేస్తారు. మృదువైన మాటలు, మంచి ఆహార స్వీకరణ పై దృష్టి. తోబుట్టువులతో, మిత్రులతో చర్చలు, సహకారం అనుకూలం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మధ్యలో విద్యార్థులు పోటీలలో అభివృద్ధి కొరకు అధిక శ్రమ. తల్లి ఆరోగ్యం మిశ్రమం. స్థిరాస్తులు, గృహ సంబంధ రుణ విషయాలలో ఆలోచనలు చేస్తారు. వారం చివరిలో ఆత్మీయులు, ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని సద్వినియో పరుచుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం కొరకు ఇష్టముతో ఖర్చులు సృజనాత్మక పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, పుణ్యక్షేత్ర దర్శన. ఇష్టదేవత ప్రార్థన అనుకూలం.

కర్కాటక రాశి...

వారం ప్రారంభంలో నూతన ఆలోచనలు నిర్ణయాలతో ఉల్లాసాన్ని పెంపొందించు కోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత విషయాలలో, వ్యాపార వ్యవహారాలలో లోతుగా పునః పరిశీలన చేసుకుంటారు. మధ్యలో ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ అంశాలు, ఘర్షణాత్మకంగా ఉంటూ వ్యక్తిగత ప్రశాంతతను తగ్గిస్తాయి. ముఖ్యంగా మాటలలో వేగాన్ని నియంత్రించుకోవాలి. సంతానముతో, వృత్తి వ్యవహారాలలో ఆశించిన ఫలితాలలో, అహం సమస్యలకు అవకాశం ఇవ్వరాదు. వారం చివరిలో శ్రమతో, వృత్తిలో వ్రాత నైపుణ్యాలు పెంపొందించుకుంటూ పనిపూర్తి చేసే ప్రయత్నాలు, ఆత్మీయ వ్యక్తుల సహకార లోపం, ఆటంకాలు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి, గృహ సౌఖ్యం, మంచి ఆహారం, మానసిక ప్రశాంతత. సుబ్రహ్మణ్య, గణపతి ఆరాధన వేలు.

సింహరాశి… 

వారం ప్రారంభంలో ఖర్చులు అధికం, ప్రశాంతత లేమి. దూర ప్రయాణాలు అవకాశం. నిద్రా భంగములు. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అవసరం. ఆలోచనలలో వేగం. ముఖ్య విషయాలలో అధిక ఉద్వేగాలని నియంత్రించుకోవాలి. మధ్యలో పెద్దలతో చర్చలలోనూ, అధికారులతో వృత్తి విషయాలలో, స్థిరాస్తి అంశాలలో అధిక వేగాన్ని నియంత్రించుకుంటూ సమతుల్యంతో ముందుకు వెళ్లాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ ఖర్చుల, వాగ్దానాల విషయాలలో ఆటంకాలు అధిగమిస్తూ శ్రమ తీసుకుంటారు. వారం చివరిలో సామర్ధ్యంతో పనులు పూర్తి. కమ్యూనికేషన్, స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. మిత్రులతో, సోదరీవర్గంతో సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటారు. దత్తాత్రేయ, సుబ్రహ్మణ్యదేవాలయ సందర్శన.

కన్యా రాశి… 

వారం ప్రారంభంలో ఆశించిన పనులు సునాయాసంగా పూర్తి. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. వారం మధ్యలో వ్యక్తిగత ఆరోగ్య అంశాలలో శ్రద్ధ ముఖ్యం, ఖర్చుల విషయాలలో తగిన ప్రణాళిక ఉపయుక్తం. ప్రవచనాలనందాన్నిస్తాయి. దూర ప్రయాణాలకు, విరాళాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఖర్చులు. నిర్ణయాలు, సామర్థ్యం అనుకూలం. ఆత్మీయుల కొరకు ఖర్చులు చేస్తారు. డ్రైవింగ శ్రద్ధ, అనవసర అలవాట్లకు దూరం ముఖ్యం. వారం చివరిలో కమ్యూనికేషన్, సహకారం, వ్యక్తిగత సామర్థ్యం, ఆలస్యం అవుతున్న వ్యవహారాలు పై దృష్టి సారిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, మాట విలువ, కుటుంబ అంశాలు అనుకూలంగా ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

తులా రాశి… 

ప్రారంభంలో వృత్తిలో శ్రద్ధతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు. గృహ, స్థిరాస్తి సంబంధ విషయాల వల్ల ఆలోచనలలో మార్పులు. వృత్తిలో అభివృద్ధి, గుర్తింపు గౌరవం, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు, నెట్వర్క్, టీంవర్క్, దూర ప్రదేశాల నుంచి, కుటుంబ సభ్యులు నుంచి సహకారం. ఎదురు చూస్తున్న లాభాల్లోవృద్ధి. వ్యాపారవృద్ధిలో కీలక మార్పులు ప్రణాళికతో అందిన లాభాలను సద్వినియోగ పరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వారం చివరిలో శ్రమఅధికం, అలసట ఒత్తిడి, నిద్రలేమి. కంటి ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. మంచిగా మాట్లాడి పనులను సాధించుకుంటారు. ఆశించిన విజయం ముఖ్యంగా వృత్తిలో సాధిస్తారు. ఆదిత్యహృదయ పారాయణ మేలు.

వృశ్చిక రాశి… 

ప్రారంభంలో ఆధ్యాత్మిక దూరప్ర యాణాల ఆలోచనలు గురువులను పెద్దలను కలుస్తారు. సంతాన విషయాలలో, మానసిక ప్రశాంతత తక్కువ. వృత్తిలో ముక్కు సూటిగా వ్యవహరిస్తారు, ధైర్యం పెరుగుతుంది. బాధ్యతలు అధికం. ఇతరుల జోక్యం చికాకును కలిగిస్తుంది. నాయకత్వ లక్షణాల అధికం. మధ్యలో వృత్తిలో ముఖ్యంగా అధికారులతో ఆశించిన పనులలో సహకారం కొరకు తగినంత సమన్వయం అవసరం. అధిక కోపాన్ని, అసహనాన్ని నియంత్రించుకోవాలి. ఆత్మీయులతో పెద్దలతో కమ్యూనికేషన్ లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. విందు వినోదాలకు, వ్యాపారవృద్ధికి, జీవిత భాగస్వామికొరకు ఇష్ట పూర్వకమైన ఖర్చులు, షాపింగ్ వంటి వాటి కొరకు ఖర్చులు అధికం. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

ధను రాశి… 

ప్రారంభంలో మానసిక ఆందోళన, ఆకస్మిక ఖర్చులు, ముఖ్య వ్యవహారాలలో చిన్నపాటి మార్పులు, గృహ సంబంధ ఖర్చుల విషయాలలో అధిక దృష్టి. ఆర్థిక, ఉన్నత విద్యా, దూరప్రయాణాల, విదేశీ అంశాలలో, తండ్రి పెద్దలతో అనుకూలతలలో మిశ్రమ ఫలితాలు. అసంతృప్తి అధికం. పెద్దల ఆరోగ్య శ్రద్ధ, వృత్తిలో అధిక ఒత్తిడి. నేత్ర సంబంధ విషయాలలో విశ్రాంతి జాగ్రత్తలు  ముఖ్యం. వృత్తి, వ్యాపారాలలో పెద్దలతో, ఉన్నత స్థాయి, పలుకబడి కలిగినవారితో చర్చలలో సమన్వయం ముఖ్యం. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వారాంతం ఖర్చులు అధికమైన, మానసిక ప్రశాంతత, ఆత్మీయులతో సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటారు. విహార యాత్రలకు కొంతవరకు అవకాశం. గణపతి ఆరాధన మేలు.

మకర రాశి… 

వారం ప్రారంభంలో వ్యాపార వ్యవహారాలు, భాగస్వామి విషయాలు మీద శ్రద్ధ వహిస్తారు. కృషి సామర్థ్యం  సహకారం అనుకూలం. సంఘంలో గుర్తింపు గౌరవం. ప్రయాణాలకు అవకాశం. వ్యక్తిగత ఆరోగ్యంలో, స్థిరాస్తి అంశాలలో ఖర్చులు. వృత్తిపరంగా ఉన్నత స్థాయి అధికారుల యొక్క సహకారం లభ్యం. రీసెర్చ్ వర్క్ వంటివాటి మీద దృష్టి. మధ్యలో ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశ ఆలోచనలు వంటివి పట్టుదలతో పూర్తి చేస్తారు. నూతన వృత్తులకై గట్టిగా ప్రయత్నం. వారాంతం వృత్తి చేసే ప్రదేశాలలో సమన్వయం ముఖ్యం. ముఖ్యంగా స్త్రీ అధికారులతో, కొలీగ్స్ తో వాదనలకు దూరం మంచిది. దత్త ఆరాధన, సుబ్రమణ్యేశ్వరస్వామి దర్శన మేలు.

కుంభ రాశి… 

వారం ప్రారంభంలో సామర్థ్యంతో నైపుణ్యాలతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు. నిత్యజీవితంలో ఆర్థికపరంగా, కుటుంబ సంబంధ ఖర్చులు అధికం. ఆర్థిక వృద్ధి పై దృష్టి. మధ్యలో వ్యక్తిగత సామర్థ్యం అనుకూలం, అయినప్పటికీ వ్యాపార వ్యవహారాలలో, మిత్రులతో ఘర్షణాత్మక వాతావరణానికి దూరంగా ఉండాలి. ఇతరుల జోక్యం చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. మంచి కమ్యూనికేషన్తో, వృత్తిపరంగా పెద్దల సహకారాన్ని, ప్రోత్సాహాన్ని సద్వినియోగ పరుచుకుంటారు. ముఖ్య విషయాలు తాత్కాలిక వాయిదా. వారాంతం దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక ఆలోచనలు, తండ్రి సహకారం, శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు, ఉన్నత విద్య, విదేశీ విషయాలలో ఆశించిన మార్పులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.

మీన రాశి… 

వారం ప్రారంభంలో సంతాన, పెట్టుబడులలో, ఉపాసన అంశాలలో ఆలోచనలు. లాభాల విషయాలలో తీసుకునే నిర్ణయాల ఒత్తిడి, ఆలస్యాల వల్ల ఇబ్బందులు. సామర్థ్యంతో పనులు పూర్తి చేయడానికి కృషి. నిత్య జీవితంలో రొటీన్ లో మార్పులు. పూర్వ రుణాలు పూర్తిచేసే ప్రయత్నాలు. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. మధ్యలో సాంఘిక సంబంధాలు అనుకూలం, జీవిత భాగస్వామితో, వ్యాపార వ్యవహారాలలో, పెద్దల సహకారంలో సమన్వయం, కమ్యూనికేషన్ ముఖ్యం. దూర ప్రయాణాలకు కూడా అవకాశాలు. వారాంతం ముఖ్య విషయాలు వాయిదా పడుతున్నప్పటికీ, కొలీగ్స్, అత్తమామలు సహకరిస్తారు. దూర ప్రదేశాల నుంచి బహుమానాలు. భాగస్వామ్య వ్యవహారాలలో చిన్నపాటి అనుకూలతలు. దత్తాత్రేయ ఆరాధన మేలు.

 

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. 

 

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com

www.padmamukhi.com