BREAKING
అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం న్యూజిలాండ్ రాజకీయాల్లో కీలక మలుపు

బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ!

Select Suryaa Now
బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ!

న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనకు (డీలిమిటేషన్) సంబంధించిన కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం రేపు (సోమవారం, నవంబర్ 30) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం తమ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఎంపీలందరూ నేడు తప్పనిసరిగా దేశ రాజధాని ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని నాయకత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పార్టీ విప్‌లు, ఎంపీలతో కీలక సమావేశం జరగనుంది. రేపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఉద్దేశం, వాటిలోని ముఖ్యాంశాలను పార్టీ అధిష్ఠానం ఎంపీలకు వివరంగా వివరించనుంది. బిల్లుల ఆమోదం కోసం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయడంతో పాటు, ఎంపీలందరూ సభకు తప్పనిసరిగా హాజరయ్యేలా పార్టీ విప్ జారీ చేసే అవకాశం ఉంది.