BREAKING
నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్ చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం

వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్

Select Suryaa Now
వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు  కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్

 

వత్సవాయి: మండల పరిధిలో ఆదివారం నిర్వహించిన రెండో విడత సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలవ్యాప్తంగా సుమారు 90 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గ్రామాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు పరిశీలిస్తే.. డబ్బాకుపల్లిలో 91 శాతం, పెంటేలవారిగూడెంలో 93 శాతం, పోలంపల్లిలో 85 శాతం, మాంగోళ్లులో 75 శాతం, దేచుపాలెంలో 92 శాతం, తాళ్లూరులో 65 శాతం, మంచినేనిపాలెంలో 90 శాతం, ఖంభంపాడులో 70 శాతం, కాకరవాయిలో 70 శాతం, వేములనర్వలో 60 శాతం, రామచంద్రాపురంలో 95 శాతం, ఇందుగుపల్లిలో 80 శాతం, వన్నెవేడులో 90 శాతం, చిన్నమోదుగపల్లి, పెద్దమోదుగపల్లిలో 90 శాతం, గోపినేనిపాలెంలో 90 శాతం పోలింగ్ నమోదైంది.

కాగా, డబ్బాకుపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయగా, తాళ్లూరు, పెంటేలవారిగూడెం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

మొత్తంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు మినహా వత్సవాయి మండలవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిర్వహణలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.