BREAKING
నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్ చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం

చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు

Select Suryaa Now
చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు

చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు

- 61 శాతం ఓటింగ్ నమోదు 
* పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్న ఓటర్లు
* 14 పంచాయతీల పరిధిలో 189 పోలింగ్ కేంద్రాలు
వృద్ధులకు సహాయపడుతున్న  పోలీసులు

చీరాల: చీరాల మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేగం పుంజుకుంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్.. సమయం గడిచేకొద్దీ ఊపందుకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్దఎత్తున తరలివస్తుండటంతో కేంద్రాల వద్ద బారులు తీరారు. మరోవైపు అభ్యర్థులు ఓటర్ల చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ   తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.చీరాల మండలంలో పిట్టువారిపాలెం పంచాయతీ మినహా 14 పంచాయతీల పరిధిలోని 189 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.12 గంటల సమయానికి 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసేలోపు ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.