BREAKING
డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్ చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం

డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి

Select Suryaa Now
డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి

*--ఉమ్మడి నాలుగు జిల్లాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి.* 

*--లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్ డిమాండ్.* 

నవాబుపేట సూర్య న్యూస్: రాబోయే నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన విస్లావత్ చందర్ నాయక్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్,రంగారెడ్డి,మెదక్,నిజామాబాద్ జిల్లాలకు చెందిన గిరిజనులకు చట్టసభల్లో తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చందర్ నాయక్  డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ..గతంలో ఎస్సీలకు జిల్లా ప్రాతిపదికన,ఎస్టీలకు రాష్ట్ర ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్,ఖమ్మం,వరంగల్,నల్లగొండ జిల్లాల గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం లభించిందన్నారు.అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్,రంగారెడ్డి,మెదక్,నిజామాబాద్ జిల్లాలకు చెందిన గిరిజనులకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం దక్కక అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో గిరిజన జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు డీలిమిటేషన్‌లో జిల్లా యూనిట్‌గా పరిగణించాలని కోరారు.ప్రతి జిల్లాలో గిరిజన జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.గిరిజనుల రాజకీయ హక్కులు,సమాన ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని చందర్ నాయక్ కోరారు.