పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి
పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి
* చల్లారెడ్డిపాలెం పంచాయతీ బచ్చులవారిపాలెంలో ఘటన
* వార్డు సభ్యుడి ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వివాదం
* పలువురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
* క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలింపు
- చీరాల: పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని బచ్చులవారిపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వార్డు సభ్యుడి ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, కత్తితో దాడి చేయడంతో వాయుల కనకయ్య తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుసమాచారం.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో గొర్రెలు, మేకలు కాపలాగా ఉన్న నక్కల కృష్ణ, పులి శ్రీను, వాయుల కనకయ్య, అంకయ్య తదితరులతో వార్డు సభ్యుడిగా కుక్కర్ గుర్తుపై పోటీ చేస్తున్న రాజు ఆయన అనుచరులు వివాదానికి దిగినట్లు ఆరోపించారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిగా భావించి తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో కత్తితో దాడి చేయడంతో పలువురు గాయపడినట్లు పేర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీసు వాహనం, 108 అంబులెన్స్ ద్వారా చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తలకు తీవ్ర గాయాలైన వాయుల కనకయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది