BREAKING
పిడుగురాళ్లలో ఘనంగా విశ్వబ్రాహ్మణ కార్తీక వనసమారాధన అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా రెండో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్. ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి -దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది – దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ హీరో షోరూం లో దొంగల బీభత్సవం.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి..!! పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు కన్నెపల్లిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని కన్నెపల్లిలో వేగవంతంగా ఐకేపీ భవన్ నిర్మాణ పనులు డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్

అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా రెండో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్.

Select Suryaa Now
అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా రెండో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్.

అనకాపల్లి ప్రతినిధి, మేజర్ న్యూస్: 

జిల్లాలో ఉదయం 7-00 గంటల నుండి పంచాయితీ ఎన్నికల పోలింగ్   ప్రశాంతంగా జరుగుతుందని, మధ్యాహ్నం 1-00 గంటల వరకు కొనసాగుతుందని, అనంతరం మధ్యాహ్నం 2-00 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తున్నారు. మర  వైపు అచ్యుతాపురం మండలం పూడిమడకలో కూడా కలెక్టర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.జిల్లా కలెక్టర్ తో పాటు  జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పై పర్యవేక్షణ చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లాలో రెండో దశలో  అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో మునగపాక మండలం, అడ్డు రోడ్డు రెవిన్యూ డివిజన్ పరిధిలో అచ్చుతాపురం, కోటవురట్ల, నక్కపల్లి , పాయకరావుపేట, రాంబిల్లి, ఎస్.రాయవరం  మరియు ఎలమంచిలి  మండలాల్లో   మొత్తం 8 మండలాల్లో 3,57,981 మంది తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా  ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, ఉత్సాహంగా ఓటరు  తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, ఉదయం11-00 గంటల వరకు జిల్లాలో 8 మండలాల్లో 1761 పోలింగ్ కేంద్రాలలో 2,34,248 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.  65.44% ఓటింగ్ నమోదైనట్లుగా కలెక్టర్ తెలిపారు.