BREAKING
కపిల్ షోలో పీయూష్ మిశ్రా మిమిక్రీతో సునీల్ గ్రోవర్ అదరహో.. మనోజ్ బాజ్‌పాయ్ ఫిదా వత్సవాయిలో ప్రారంభమైన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు స్పఘెట్టి స్ట్రాప్స్ వేసుకున్నా నా మూలాలు మారవు.. పంచాయత్‌పై నీనా గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమాపై వివేక్ ఒబెరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రేక్షకులకు స్ఫూర్తినివ్వాలంటూ ఆకాంక్ష కైల్ జేమీసన్ దూకుడు వ్యాఖ్యలు.. ఆకాశ్ దీప్‌పై బౌన్సర్ల వర్షం వెనుక అసలు కారణమిదే భారత్‌పై మాట్ హెన్రీ అరుదైన రికార్డు.. దిగ్గజ బౌలర్ల సరసన చేరిన కివీస్ పేసర్ స్వగ్రామం లింగాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న టీడీ జనార్ధన్ కౌంటింగ్ ప్రక్రియకు సిద్ధమైన ఏర్పాట్లు. గాల్లోకి ఎగిరి అద్భుత క్యాచ్.. డెవాన్ కాన్వే వికెట్ తీసిన యశస్వి జైస్వాల్ జురెల్, బ్రార్ అరుదైన భాగస్వామ్యం.. న్యూజిలాండ్ గడ్డపై తొమ్మిదో వికెట్‌కు మూడో అత్యధిక రికార్డు ధ్రువ్ జురెల్ వీరోచిత పోరాటం.. ఫాలోఆన్ గండం నుంచి బయటపడ్డ టీమిండియా వత్సవాయిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాతయ్య జవగళ్ శ్రీనాథ్ రికార్డు బద్దలుకొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. విదేశీ గడ్డపై అరుదైన మైలురాయి మూడో రోజు ముగిసిన ఆట.. రెండో టెస్టులో న్యూజిలాండ్ 243 పరుగుల ఆధిక్యం ఆకాశ్ దీప్‌కు గాయం.. టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ, ప్రసిద్ధ్ కృష్ణ ఎంట్రీ

ధ్రువ్ జురెల్ వీరోచిత పోరాటం.. ఫాలోఆన్ గండం నుంచి బయటపడ్డ టీమిండియా

Select Suryaa Now
ధ్రువ్ జురెల్ వీరోచిత పోరాటం.. ఫాలోఆన్ గండం నుంచి బయటపడ్డ టీమిండియా

సూర్య స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుకు యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అండగా నిలిచారు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా సాగుతున్న ఈ పోరులో జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో జురెల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. 170 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్, టీమిండియాను ఫాలోఆన్ ప్రమాదం నుంచి గట్టెక్కించారు.

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేయగా, బదులుగా బరిలోకి దిగిన భారత్ వరుస వికెట్లు కోల్పోయి 117 పరుగులకే ఏడు వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో పట్టుదలతో క్రీజులో నిలిచిన జురెల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆకాశ్ దీప్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 46 పరుగులు జోడించడం ద్వారా ఫాలోఆన్ మార్కును దాటించారు.

ఆ తర్వాత గుర్నూర్ బ్రార్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించిన జురెల్, జట్టు స్కోరును మరింత ముందుకు తీసుకెళ్లారు. చివరి వికెట్‌కు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి మరో 19 పరుగులు జోడించిన అనంతరం జురెల్ 88 పరుగుల వద్ద కైల్ జేమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యారు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 86.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది.

న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, జాకబ్ డఫీ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 110 పరుగుల ఆధిక్యం లభించగా, జురెల్ పోరాటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.