జగిత్యాలలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం
సూర్య జగిత్యాల ప్రతినిధి:డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అవగాహనా చేసుకొని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు దుమాల గంగాధర్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ సంఘం నాయకులు దుమాల గంగాధర్ పాల్గొని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో ఘన నివాళ్లు అర్పించి మహానుభావుని సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం ప్రధాన కార్యదర్శి కంటే అంజయ్య దళిత క్రిస్టియన్ సంఘాల అధ్యక్షులు ముద్దమల్ల ప్రవీణ్ కుమార్, రుద్ర మనోహర్, బొల్లం ప్రభాకర్, కంచి సురేష్, అడ్వకేట్ నల్ల సురేష్, దాసరి ప్రవీణ్, సుంకరపల్లి అశోక్, కండ్లే లక్ష్మణ్, సంకెమహేష్ పాల్గొన్నారు.