అహోబిలం బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని
ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి.
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;
అహోబిలం ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల్లో గాయపడి నంద్యాలలోని ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన, బాధితులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
అదేవిధంగా, రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన చెంగలి వెంకటస్వామిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసిన ఘటనలో గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీనివాసా ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా