మోడల్ పంచాయతీగా మారుస్తా
మోడల్ పంచాయతీగా మారుస్తా
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. పెద్ద కాలువ గ్రామపంచాయతీని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా సర్పంచిగా పోటీ చేయడం జరిగిందని దుర్గ తెలిపారు. ఆదివారం స్థానిక పంచాయితీలో ప్రచారం నిర్వహిస్తూ గ్రామం లోని ప్రతి ఇంటి లోని సభ్యులను తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తూ కరపత్రాలను అందిస్తూ ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 2,100 ఓట్లు గలిగిన మేజర్ పంచాయతీకి తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడంతో తనకు ఎన్నికల సంగం మంచం గుర్తును కేటాయించడం జరిగిందని ప్రతి ఓటరు మంచం గుర్తుపై ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. పంచాయతీ సర్పంచ్ గా తాను గెలిస్తే మేజర్ పంచాయితీగా ఉన్న పెద్ద కాలువ గ్రామపంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా మారుస్తూ ఆధునిక మౌలిక వసతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కోదండయాదవ్ , మునిరాజ్ యాదవ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.