BREAKING
పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ సర్పంచ్ వెంకోబరావును సన్మానించిన బ్రాహ్మణ సంఘం పాల్ టెక్నిక్ కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు! దుబాయ్‌లో భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవం

పంచాయతీ అభివృద్ధికే ఐక్యత రాగం

Select Suryaa Now
పంచాయతీ అభివృద్ధికే ఐక్యత రాగం

పూసపాటిరేగ, మేజర్ న్యూస్ : 
పంచాయతీలో అభివృద్ధి పథంలో నడిపించేందుకే నడిపిల్లి సర్పంచ్ గా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి ఆశీర్వదించాలని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లంకలపల్లి శ్రీనివాసరావు అన్నారు. నడిపల్లి పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు తన సతీమణి, మాజీ సర్పంచ్ అయిన లంకలపల్లి గాయత్రి,, వెంకట అప్పారావు లతో కలిసి పంచాయితీ కేంద్రమైన నడిపల్లి తో పాటు శివారు గ్రామమైన చిన్న మేడిపల్లిలో భారీ ఎన్నికల ర్యాలీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయితీని అభివృద్ధి చేయాలన్న తపనే తప్ప తనకు ఎటువంటి స్వార్ధము లేదన్నారు. గత పది ఏళ్లుగా పంచాయితీకి సర్పంచ్గా పనిచేసినప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో ఓటర్లకు గుర్తు చేశారు. పంచాయితీలో ఉన్న యువత అందరికీ వేదబయో ఫ్యూయల్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటానంటూ ఈ సందర్భంగా ఓటర్ లకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి తనకు సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశల కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఓటర్లు, అభిమానులు పాల్గొన్నారు.