BREAKING
పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ సర్పంచ్ వెంకోబరావును సన్మానించిన బ్రాహ్మణ సంఘం పాల్ టెక్నిక్ కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు! దుబాయ్‌లో భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవం

పాల్ టెక్నిక్ కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు!

Select Suryaa Now
పాల్ టెక్నిక్ కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు!

 

*చీకటి పడితే మందుబాబుల హంగామా..

*మైదానంలో మద్యం సీసాలే దర్శనం!

*విద్యార్థుల భద్రతపై ఆందోళన

*పట్టించుకోని యాజమాన్యమంటూ విమర్శలు

విజయనగరం బ్యూరో, మేజర్ న్యూస్:

విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందన్న ఆరోపణలు విజయనగరంలోని పాల్ టెక్నిక్ కాలేజీపై వెల్లువెత్తుతున్నాయి. కళాశాల ప్రాంగణంలో రాత్రివేళ బహిరంగంగా మద్యం సేవిస్తూ కొందరు హంగామా చేస్తున్నా అడ్డుకునే వారే కరువయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాసంస్థకు రక్షణగా ఉండాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ ప్రైవేట్ వాచ్ మెన్ గా చేరిన ఒక వ్యక్తి హాస్టల్ లో అన్ని తానే అన్న పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కళాశాల మైదానంలో ఎక్కడ చూసినా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయని, రాత్రి వేళల్లో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరుసటి రోజు కళాశాలకు వచ్చే విద్యార్థులు ఈ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కళాశాల ప్రాంగణంలో బాలుర, బాలికల వసతి గృహాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటంతో పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు ఉన్నాయి. వార్డెన్ల పర్యవేక్షణ సక్రమంగా ఉందా లేదా అన్నదానిపై కూడా స్పష్టత లేదని తెలుస్తోంది. రాత్రివేళ భద్రతను పర్యవేక్షించాల్సిన వాచ్‌మెన్ విధుల నిర్వహణపైనా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొందరు ఆకతాయిలు విద్యార్థులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యాసంస్థ ప్రాంగణంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటే విద్యార్థులకు రక్షణ ఎక్కడుంటుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం స్పందించి ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, రాత్రివేళ పర్యవేక్షణ పెంచాలని, మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత అధికారులు కూడా తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.