BREAKING
ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ

17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి..

Select Suryaa Now
17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి..


- ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. పొట్నూరు పృథ్వి రాజ్ .

నరసన్నపేట, మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ పంచాయతీ 17వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొట్నూరు పృథ్వి రాజ్  ఆదివారం గాంధీనగర్ ప్రాంతంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అభ్యర్థిగా తనకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వార్డు సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అవినీతికి తావులేని పాలన అందించడంతో పాటు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని తెలిపారు. వార్డులోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అవసరాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామపంచాయతీ ద్వారా అందే సేవలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

ముఖ్యంగా తాగునీటి సరఫరా, వీధి రహదారుల నిర్వహణ, ప్రతిరోజూ పారిశుధ్య కార్యక్రమాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధికి తనకు మద్దతుగా నిలిచి, స్టూలు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గాంధీనగర్ ప్రజలను పొట్నూరు పృథ్వి రాజ్ విజ్ఞప్తి చేశారు.