BREAKING
ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ

నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు.

Select Suryaa Now
నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు.

కళ్యాణదుర్గం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకుల వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో మాజీ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుల రాజకీయ కార్యకలాపాలపై ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో, ఉపాధ్యాయ వృత్తి గౌరవానికి భంగం కలుగుతోందంటూ కొందరు ఉపాధ్యాయ నాయకులు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా మారుతి, సంగప్పలు ప్రెస్‌మీట్ల ద్వారా తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయుల ఆత్మగౌరవం, వృత్తి ధర్మం, రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎన్నికల విధులు నిర్వర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాంతిరాజ్‌ను ఉద్దేశించి చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, గతంలో ఉపాధ్యాయుల గౌరవం కోసం గళమెత్తిన నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధి ఒక ఉపాధ్యాయుడిని బహిరంగంగా అవమానించేలా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్పందించి తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన నాయకులు, నేడు అదే తరహా వివాదం అధికార పార్టీ ఎమ్మెల్యే చుట్టూ చోటుచేసుకున్నప్పుడు మౌనం పాటించడం విమర్శలకు తావిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం రాజకీయాలకు అతీతంగా వృత్తి గౌరవం, సభ్యుల ఆత్మగౌరవం, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడి వ్యాఖ్యలపై స్పందించినప్పుడు చూపిన చురుకుదనం, నేడు అధికార పార్టీ నాయకుడి వ్యాఖ్యలపై ఆరోపణలు వచ్చిన సందర్భంలోనూ కనిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా, విద్యార్థులకు నైతిక విలువలు బోధించే బాధ్యత కలిగినవారిగా ఉంటారు. అలాంటి వృత్తికి సంబంధించిన వ్యక్తుల గౌరవం విషయంలో రాజకీయ పక్షపాతం లేకుండా వ్యవహరించాలన్నది ప్రజల అభిప్రాయం. మారుతి, సంగప్పలు ఈ వివాదంపై తమ వైఖరిని స్పష్టం చేసి, కాంతిరాజ్‌కు సంబంధించిన ఘటనపై స్పందిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం వ్యక్తిగత రాజకీయ అనుబంధాలకు అతీతంగా వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు.