BREAKING
పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ సర్పంచ్ వెంకోబరావును సన్మానించిన బ్రాహ్మణ సంఘం పాల్ టెక్నిక్ కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు! దుబాయ్‌లో భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవం

నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మెదక్ మేజర్ న్యూస్ ప్రతినిధి ;  నర్సాపూర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ఆదివారం ఒక ప్రకటనలో  తీవ్రంగా ఖండించారు ఖండించారు.ఆదివారం నాడు టీజీ 35 జెడ్ 0034 నంబర్ గల ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి నర్సాపూర్ మీదుగా గజ్వేల్‌కు వెళ్తున్న క్రమంలో నర్సాపూర్ ఎక్స్ రోడ్‌లోని లక్ష్మీ హోటల్ ఎదుట ప్రయాణికులను దించేందుకు బస్సును స్టేజీ వద్ద నిలిపారు. ఈ సమయంలో వెనుక నుంచి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు బస్సును ఢీకొట్టి, అనంతరం బస్సు ముందు వాహనాన్ని అడ్డంగా నిలిపి డ్రైవర్, కండక్టర్‌పై దాడికి పాల్పడినట్లు మంత్రి దృష్టికి వచ్చింది.ఈ ఘటనలో ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ కె. నరేష్ (73360), కండక్టర్ పి. శ్రీకాంత్ (ఇ 801997)పై దాడి చేయడంతో పాటు, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక మాజీ కౌన్సిలర్ రాజేందర్, ఇతర స్థానికులపైనా దాడికి పాల్పడటం ఆందోళనకరమని మంత్రి పేర్కొన్నారు.ప్రజలకు నిరంతరం రవాణా సేవలు అందిస్తూ విధులు నిర్వహించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడటం ఏమాత్రం సహించరాని విషయమని అన్నారు. విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ ఘటనపై నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.ఆర్టీసీ సిబ్బంది ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా విధులు నిర్వహించాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.