telangana
భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : నిర్మల్ పట్టణంలోని ఎఫ్.సి.ఎస్. దివ్యానగర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం స్పోర్ట్స్ కరాటే-డో అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు.తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ తేజేందర్ సింగ్ భాటియా, జిల్లా ప్రెసిడెంట్ శ్రీకాంత్, జిల్లా జనరల్ సెక్రటరీ అమ్ముల భూషన్ ఆధ్వర్యంలో భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన సుమారు 80 మంది విద్యార్థులు ఈ గ్రేడింగ్ టెస్ట్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జూనియర్, రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్ తదితర బెల్ట్‌లకు విద్యార్థులు గ్రేడింగ్ పొందారు.ఈ కార్యక్రమంలో కోచ్‌లు అనంతుల ప్రదీప్,చిరంజీవి, వంశీ, , శేర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రేడింగ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిర్వాహకులు, కోచ్‌లు అభినందించారు.