పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతున్న కార్నివాల్
గుంటూరు : గుంటూరులోని భారతీయ విద్యా భవన్ ఆధ్వర్యంలో ఈనెల 28, 29 వ తేదీలలో నిర్వహించిన గ్రాండ్ కార్నివాల్ బాలబాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడు తుందని భారతీయ విద్యా భవన్ కార్యదర్శి పి.రామచంద్ర రాజు, కనెక్ట్ సంస్థ చైర్మన్ త్రిపుర మల్లు అరుణ కుమార్, చేయూత ఫౌండేషన్ కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. మొబైల్ ను అతుక్కుపోతూ తమ బాల్యాన్ని కోల్పోతున్న బాలబాలికల పరిస్థితిని మార్చడానికి రెండు రోజులపాటు జరిగిన బాలల పండుగ తోడ్పడింద న్నారు . దాదాపు 6 వేల మంది బాలలు తల్లిదండ్రులతో పాటు కలిసి భారతీయ విద్యా భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వినోద విజ్ఞానాత్మక కార్యక్రమాలలో పాలుపంచు కున్నారు. రోబోటిక్, సైన్స్ ప్రయోగాలు, రాక్ క్ల యిమింగ్ లాంటి విన్యాసాలలో పిల్లలు స్వయంగా పాల్గొనే అవకాశం కల్పించడం ఈ కార్నివాల్ ప్రత్యేకంగా నిలిచింది. చిత్ర కళా ప్రదర్శనలు,వైల్డ్ లైఫ్ ఫోటోల ప్రదర్శనలు, కలరోపియా లాంటి ప్రదర్శనలు విద్యార్థులకు విజ్ఞానంతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని కూడా అందించాయి. ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటుచేసి విక్రయించిన పలు గేమ్ లు, బొమ్మలు, నూతన త్వానికి నిదర్శనంగా నిలిచాయి. కార్నివాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అనేక ఫుడ్ స్టాల్స్ దేశవ్యాప్తంగా గల అనేక ప్రాంతాల రుచులను, పాశ్చాత్య రుచులను ఆహుతులకు అందించాయి. ప్లాస్టిక్ వాడకుండా కేవలం కాగితం ప్లేట్లు, వెదురు స్పూన్లు లాంటి వాటిని వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ రహితంగా జీవించడం ద్వారా విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఈ కార్నివాల్ లో స్వయంగా ఆచరించి చూపారు. భారతీయ విద్యా భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అందమైన గొడుగులతో కూర్చిన అలంకారాలు, ఫోటో బూత్ లు, సెల్ఫీ స్టాండులతో విద్యార్థులు మమేకమై రెండు రోజులు పూర్తిస్థాయిలో మొబైల్ ఫోను లేని బాల్యాన్ని అనుభవించారు. సాయం సమయాలలో విద్యా భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు గుడ్ డాన్స్ కార్యక్రమాలు విద్యార్థు లతోపాటు ఉపాధ్యా యులను, తల్లిదండ్రులను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేశాయి. ఈ కార్యక్రమంలో కనెక్ట్ సంస్థ చైర్మన్ త్రిపురమల్లు అరుణ్ కుమార్ సహకారంతో అభినందన ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న పిల్లల ఆశ్రమానికి చెందిన అనాధ బాలబాలికలు 60 మంది కార్నివాల్ లో పాల్గొనడం విశేషము. ఈ రెండు రోజుల కార్నివాల్ కేవలం ప్రారంభం మాత్రమే అని ఇటువంటి కార్యక్రమాలు ప్రతి వారంత ములోనూ నిర్వహించే ఏర్పాటు చేస్తున్నామని భారతీయ విద్యా భవన్ కార్యదర్శి పి.రామచంద్ర రాజు తెలిపారు. నగరంలోని అన్ని విద్యాసంస్థల్లో ఉన్న విద్యార్థులకు ప్లాస్టిక్ రహిత కార్యక్రమాల పట్ల ఆసక్తి కల్పించి, గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడానికి కనెక్ట్ సంస్థ కృషి చేస్తుందని అధ్యక్షులు త్రిపురమల్లు అరుణకుమార్, కో ఆర్డినేటర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.
సూర్య నాయక్