BREAKING
పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతున్న కార్నివాల్ భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ : భూషన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పీఎం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1.5లక్షల వరకు చికిత్స - ఎస్పీ అఖిల్ మహాజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భక్తుల కొంగుబంగారం అహోబిలేశ్వరుడు.. భక్తిశ్రద్ధలతో పూజలు ఈవిజయం పెద్దూరు ప్రజలదే..వారి నమ్మకాన్ని వమ్ము చేయను నూతన సర్పంచ్ తెర్లి రామలక్ష్మి వెల్లడి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు.

పీఎం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1.5లక్షల వరకు చికిత్స - ఎస్పీ అఖిల్ మహాజన్

Select Suryaa Now
పీఎం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1.5లక్షల వరకు చికిత్స - ఎస్పీ అఖిల్ మహాజన్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో అమలు చేస్తున్న పీఎం రహత్ (పీఎం రహత్ ) పథకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.ఈ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు నిబంధనల ప్రకారం రూ.1.5 లక్షల వరకు, గరిష్ఠంగా 7 రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స అందుతుందని తెలిపారు.జిల్లాలో పథకం కింద ఈ దార్ లో నమోదైన 7 ఆసుపత్రులు:1. రిమ్స్ ఆసుపత్రి, ఆదిలాబాద్.2. ఏరియా ఆసుపత్రి, బోథ్.3. జిల్లా ఆసుపత్రి, ఉట్నూర్.4. క్రోమ్ ఆసుపత్రి, ఆదిలాబాద్.5. నక్షత్ర ఆసుపత్రి, ఆదిలాబాద్.6. దేవిప్రియ ఆసుపత్రి, ఆదిలాబాద్.7. శ్రీ గజానన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి,ఆదిలాబాద్.ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, మొదటి ఒక గంటలోపు (గోల్డెన్ హౌర్ ) అత్యవసర చికిత్స అందేలా చూడాలని కోరారు. అత్యవసర సహాయం కోసం 112కు కాల్ చేయాలని సూచించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం మానుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు.ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకొని ప్రమాదాల నివారణకు సహకరించాలని, ప్రమాద బాధితులకు మానవతా దృక్పథంతో తక్షణ సహాయం అందించి విలువైన ప్రాణాలను కాపాడాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.