అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణ, పూజా మండపంలోని ఉత్సవమూర్తి అలంకరణ కోసం విజయవాడకు చెందిన ఆర్. చిరంజీవిరావు వివిధ రకాల పట్టు చీరలను ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ పాల్గొన్నారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.