BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

ఇంద్రకీలాద్రిపై ప్రధాని మోదీ పేరిట ఖడ్గమాల అర్చన - పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన లింగమనేని రమేష్

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై ప్రధాని మోదీ పేరిట ఖడ్గమాల అర్చన - పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన లింగమనేని రమేష్

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారి సన్నిధిలో రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మోదీకి ఆయురారోగ్యాలు, దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపించే శక్తిసామర్థ్యాలు కలగాలని కోరుతూ ఖడ్గమాల అర్చన చేయించారు. ఈ సందర్భంగా లింగమనేని రమేష్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌కు కూడా కేంద్రం నుంచి ప్రాధాన్యత లభిస్తోందన్నారు. అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయం వంటి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్ మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భర దేశంగా అభివృద్ధి చెందాలని, వికసిత్ భారత్ సంకల్పం సాకారం కావాలని ఆకాంక్షించారు. ఖడ్గమాల అర్చన ప్రసాదం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, ఠాకూర్ అజయ్ వర్మ, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.